Vijay Sethupathi: విజయ్ సేతుపతి సాయం చేసినా.. వృద్ధురాలిని వెంటాడిన దురదృష్టం!

  • మామనిథాన్ షూటింగ్‌లో విజయ్ సేతుపతి
  • మందుల కోసం డబ్బులడిగిన కవలమ్
  • డబ్బు తీసుకెళుతుండగా స్పృహ కోల్పోయింది
  • ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే మృతి

ఆర్థిక సాయం కోరి వచ్చిన వృద్ధురాలికి.. తమిళ సినీ హీరో విజయ్ సేతుపతి వెంటనే సాయమందించాడు, కానీ ఆమె ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచి వేస్తోంది. శీను రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మామనిథాన్ సినిమా షూటింగ్‌లో ఉండగా.. గతంలో కొన్ని సినిమాలలో నటించిన కవలమ్ అచ్చమ్ అనే వృద్ధురాలు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవంటూ విజయ్‌ను వచ్చి కలిసింది. వెంటనే స్పందించిన విజయ్.. ఆమెకు డబ్బు అందజేశారు. కవలమ్ డబ్బు తీసుకుని వెళుతుండగా దారిలో స్పృహ కోల్పోయి పడిపోయింది.

అక్కడ ఉన్నవారు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. కవలమ్ గతంలో మలయాళం సినిమాల్లో నటించిందని తెలుస్తోంది. అయితే కవలమ్‌కు విజయ్ సాయమందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు తెగ ఖుషీ అయ్యారు కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తరువాత కవలమ్ చనిపోయిన విషయాన్ని తెలుసుకుని ఆవేదన చెందుతున్నారు.

Vijay Sethupathi
Kavalam Acham
Mamanithan
Seenu Ramaswamy
Movie Shooting
  • Loading...

More Telugu News