Narendra Modi: ‘మన్ కీ బాత్’ కాస్తా ‘మంకీ బాత్’గా మారిపోయింది: మోదీపై సుజనా ఫైర్

  • ‘మేకిన్ ఇండియా’ కాదు ‘మైక్ ఇన్ ఇండియా’ చేశారు
  • ఒకప్పుడు 2 నుంచి 280 సీట్లకు బీజేపీ ఎదిగింది
  • బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికే చేరడం ఖాయం

భారత్ ను ‘మేకిన్ ఇండియా’గా కాదు ‘మైక్ ఇన్ ఇండియా’గా ప్రధాని మోదీ చేశారని ఏపీ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘మన్ కీ బాత్’ కాస్తా ‘మంకీ బాత్’గా మారిపోయిందని, మౌలిక వసతుల కల్పనకు పెట్టిన ఖర్చు కన్నా స్వచ్ఛ భారత్ ప్రకటనలకు అయిన ఖర్చే ఎక్కువ అని ఎద్దేవా చేశారు.

ఒకప్పుడు రెండు సీట్ల నుంచి 280 సీట్లకు ఎదిగిన బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికే చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని, ఏపీకి ఏం చేశారన్న విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు.

Narendra Modi
bjp
Telugudesam
Sujana Chowdary
man ki baath
make in india
swachha bharath
  • Loading...

More Telugu News