YSRCP: కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు: వైఎస్ జగన్

  • కేంద్రంలో ‘హంగ్’ వస్తుందని సర్వేలు చెబుతున్నాయి
  • ఎన్నికలకు ముందు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోం
  • ముందే పొత్తులు పెట్టుకుంటే మోసపోతాం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని వైసీపీ అధినేత జగన్ జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని, వాళ్ల మాటలు నమ్మి ముందే పొత్తులు పెట్టుకుంటే మోసపోతామని వ్యాఖ్యానించారు.

 ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎవరైతే సంతకం పెడతారో వారికే తమ మద్దతిస్తామని మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు తమ పథకాలు ఎంత కాపీ కొట్టినా ప్రజలు నమ్మరని, కియా ఫ్యాక్టరీ క్రెడిట్ చంద్రబాబు తీసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ, అందులో 5 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వలేదని విమర్శించారు.

YSRCP
jagan
Andhra Pradesh
special status
  • Loading...

More Telugu News