Telugudesam: గవర్నర్ ప్రసంగమంతా అబద్ధాల పుట్ట: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
- చక్కెర పూసిన మాత్రలా వాస్తవాలకు విరుద్ధం
- నిందితులు టీడీపీకి చెందినవారు
- ఆర్థిక క్రమశిక్షణ 5.6 శాతానికి పెరిగింది
రాష్ట్ర ఆదాయంలో మూడు శాతం ఉండాల్సిన ఆర్థిక క్రమశిక్షణ.. నేడు 5.6 శాతానికి పెరిగిందని.. వచ్చే ప్రభుత్వాల క్రమశిక్షణను సైతం ఇప్పుడున్న ప్రభుత్వమే దిగమింగిందంటూ వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. నేడు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్‌పై దాడి ఘటనలో నిందితులు టీడీపీకి చెందినవారు కాబట్టే ఎన్‌ఐఏ విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగమంతా అబద్ధాల పుట్ట అని.. చక్కర పూసిన మాత్ర లాగా వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారని ఆరోపించారు. తమ ప్రభుత్వమని చెప్పుకునే గవర్నర్.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా మాట్లాడక పోవటం విడ్డూరంగా ఉందని వెంకటేశ్వర్లు విమర్శించారు.