jagan: జగన్ ‘నవరత్నాలు’ ఇవి!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు

  • జగన్ పథకాలను మేము కాపీ కొట్టడమేంటి?
  • కాపీ కొట్టాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు
  • మిగిలిన రాష్ట్రాలు బాబును ఫాలో అవుతున్నాయి

తమ పథకాలను కాపీ కొడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఖండించారు. ఎవరి పథకాలనూ కాపీ కొట్టాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని, సంక్షేమ పథకాల అమలులో మిగిలిన రాష్ట్రాలు బాబును ఫాలో అవుతున్నాయని  అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి పథకాలను మేము కాపీ కొట్టడమేంటి? అని ప్రశ్నించారు. జగన్ ని కాపీ కొట్టడమంటే, ఆయనలా లక్ష కోట్లు దోచుకోవడం, ఆయనలా జైల్లో ఉండొస్తే కాపీ కొట్టారనొచ్చంటూ సెటైర్లు విసిరారు.

‘చంద్రబాబునాయుడు గారు పులి.. మీరు నక్క’ అంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. ‘అసలు, మీ ‘నవరత్నాలు’ అంటే ఏంటీ? బెదిరించడం, బాధించడం, వేధించడం, దోచుకోవడం, దాచుకోవడం, పారిపోవడం, వంచించడం, మాటమార్చడం, చేతులెల్తేయడం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. జగన్ లాంటి వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే, తాను చెప్పిన  ఈ తొమ్మిది కచ్చితంగా చేస్తాడని నిప్పులు చెరిగారు.

jagan
YSRCP
Telugudesam
buddha venkanna
  • Loading...

More Telugu News