YSRCP: నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు తగవు: వైసీపీ నేత మేకపాటి

  • నేను పార్టీ వీడుతున్నానన్న వార్తలు అబద్ధం
  • కొన్ని మీడియా సంస్థల దుష్ప్రచారం తగదు
  • వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా 

తాను పార్టీ వీడుతున్నానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, తాను పార్టీ వీడుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని, నైతిక విలువలకు కట్టుబడి వార్తలు రాయాలి తప్ప, ఇలాంటి అసత్య ప్రచారాలు తగవని హితవు పలికారు.

 వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచి జగన్ తో కలిసి పని చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. ఏపీకి మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, చంద్రబాబు వంచనతో ప్రజలు విసిగిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, అవి సాధించిన తర్వాతే ప్రజలను ఓటు వేయమని అడిగే హక్కు బాబుకు ఉందని వ్యాఖ్యానించారు.

YSRCP
Jagan
parliament
mekapati
rajamohan reddy
Chief Minister
Chandrababu
  • Loading...

More Telugu News