eshwar: మరో ప్రేమకథా చిత్రంగా '4 లెటర్స్'

  • హీరోగా ఈశ్వర్ పరిచయం
  •  హీరోయిన్స్ గా అంకిత - టువ
  •  సంగీత దర్శకుడిగా భీమ్స్

తెలుగు తెరపై ఎప్పటికప్పుడు కొత్తకోణంలో ప్రేమకథలు ఆవిష్కరించబడుతూనే వున్నాయి .. వీలైనన్ని విజయాలను అందుకుంటూనే వున్నాయి. అలా తాజాగా రూపొందిన మరో ప్రేమకథా చిత్రమే '4లెటర్స్' .. 'కుర్రాళ్లకి అర్థమవుతుందిలే' అనేది ట్యాగ్ లైన్. ఉదయ్ కుమార్ - హేమలత నిర్మించిన ఈ సినిమాకి రఘురాజ్ దర్శకత్వం వహించాడు. ఈశ్వర్ హీరోగా .. అంకిత - టువ కథానాయికలుగా ఈ సినిమాలో నటించారు.

తాజాగా ఈ సినిమా ఆడియోను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి .. నిర్మాత అచ్చిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. సాంగ్స్ చాలాబాగున్నాయి. హీరో ఎనర్జీ లెవెల్స్ చూసి ఆశ్చర్యపోయాము. కమర్షియల్ హీరోగా ఈశ్వర్ కి మంచి భవిష్యత్తు వుంది. టైటిల్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది. దర్శక నిర్మాతలకి ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాము" అన్నారు. దర్శకుడు రఘురాజ్ మాట్లాడుతూ .. " ఎక్కడా రాజీ పడకుండగా 75 రోజుల్లో ఈ సినిమాను తీశాము .. కథలో మంచి మెసేజ్ ఉంటుంది" అన్నాడు. ఇకపాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి భీమ్స్ చాలా చక్కని సంగీతాన్ని అందించాడు' అన్నారు.

  • Loading...

More Telugu News