Andhra Pradesh: వైసీపీలో చేరిన వర్ల రామయ్య సోదరుడు రత్నం.. ఆహ్వానించిన జగన్!

  • పున్నం ఆసుపత్రి అధినేత నర్సింహారావు కూడా
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్
  • ఇప్పటికే వైసీపీలో చేరిన మేడా మల్లికార్జున రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్న వర్ల రత్నం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన పున్నం హాస్పిటల్స్ అధినేత పున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు పున్నం నాగ మల్లికార్జునరావు కూడా ఈ సందర్భంగా వైసీపీలో చేరారు. వీరందరికీ కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తన సోదరులు, నాలుగు వేల మంది అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
YSRCP
varla ramaiah
punnam
narsimha rao
Jagan
Telugudesam
  • Loading...

More Telugu News