Andhra Pradesh: పార్లమెంటు ఆవరణలో టీడీపీ సభ్యుల ఆందోళన!

  • హోదా, విభజన హామీల అమలుకు డిమాండ్
  • ప్లకార్డులు పట్టుకుని నినాదాలు 
  • నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

సుజనా చౌదరి, కనకమేడల, అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడు, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఏపీకి న్యాయం చేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏపీ హక్కుల కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని టీడీపీ సభ్యులను చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
parliaments
Telugudesam
mps
Special Category Status
  • Loading...

More Telugu News