Andhra Pradesh: 4,000 మంది అనుచరులతో వైసీపీలో చేరిన మేడా.. సాదరంగా ఆహ్వానించిన జగన్!

  • 300 వాహనాల్లో హైదరాబాద్ కు రాక
  • టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
  • కార్యక్రమానికి అమర్ నాధ్ రెడ్డి గైర్హాజరు

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరారు. ఈరోజు సోదరులు రఘునాథ రెడ్డి, సుధాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లోని జగన్ నివాసానికి మేడా చేరుకున్నారు. వీరికి జగన్ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలోకి చేరకముందు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మేడా మల్లికార్జున రెడ్డి రాజీనామా సమర్పించారు.

దాదాపు 300 వాహనాల్లో 4,000 మంది అనుచరులతో కలిసి మేడా జగన్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కాగా, ఈ కార్యక్రమానికి వైసీపీ నేత అమర్ నాధ్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. మేడా వర్గీయుల చేరికను అమర్ నాధ్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh
Kadapa District
YSRCP
Jagan
meda
mallikarjuna reddy
Hyderabad
  • Loading...

More Telugu News