mumbai: ప్రియురాలిపై హత్యాయత్నం...తర్వాత ప్రియుడి ఆత్మహత్యా యత్నం.. ఇద్దరూ ఆసుపత్రిలో!

  • ముంబయి నగరంలో ఓ ప్రియుడి దారుణం
  • తీవ్రంగా గాయపడిన ఇద్దరూ
  • ప్రేయసితో విభేదాలే కారణమని భావన

ప్రియురాలితో విభేదాల నేపధ్యంలో ఆమెను హత్యచేసి తానూ ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డాడో ప్రియుడు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ముంబయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. నగరంలోని వాకేశ్వర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న కునాల్‌ బదాని ఓ ట్రావెల్‌ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. మరో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల యువతితో ఇతను ప్రేమలో పడ్డాడు. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కొన్నాళ్లుగా తిరుగుతున్నారు.

 ఇటీవల కునాల్‌తో విభేదాలు రావడంతో ఆ యువతి అతనికి దూరంగా ఉంటూ వస్తోంది. దీన్ని తట్టుకోలేకపోయిన కునాల్‌ మాట్లాడాలని చెప్పి బోరివలిలోని పార్క్‌కు రప్పించాడు. తీరావచ్చాక తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రక్తం ఓడుతూ పడివున్న ఇద్దరినీ గుర్తించిన పార్క్‌ సందర్శకులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నారని పోలీసుల సమాచారం.

mumbai
lover attack
girl seriously injred
  • Loading...

More Telugu News