Andhra Pradesh: పార్లమెంటు సమావేశాలు షూరూ.. ప్రాంగణంలో ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు!

  • విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ధర్నా
  • ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం డిమాండ్
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు పార్లమెంటు ముందు గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 13 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, కంపెనీల సవరణ చట్టం బిల్లు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లు, జాతీయ పౌరసత్వ బిల్లులను ఆమోదింప జేసుకునేందుకు కేంద్రం రెడీ అవుతుండగా, బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.

  • Loading...

More Telugu News