గోపీచంద్ సరసన మొదటిసారిగా తమన్నా?
- తిరు దర్శకత్వంలో గోపీచంద్
- రాజస్థాన్ లో ఫస్టు షెడ్యూల్
- నిర్మాతగా అనిల్ సుంకర
ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని తీసుకోవాలా అనే విషయంలో కొంతమంది పేర్లను పరిశీలించారు. తమన్నా అయితే బాగుంటుందని భావించారట. తమన్నాను సంప్రదించగా ఆమె పాజిటివ్ గా స్పందించిందని అంటున్నారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. తమన్నా ఓకే అంటే గోపీచంద్ తో ఆమెకి ఇది తొలి సినిమా అవుతుంది. 35 కోట్ల బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాకి, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.