maoist: నేడు మావోయిస్టుల భారత్ బంద్.. ఏజెన్సీలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు!

  • ఆపరేషన్ సమాధాన్ కు వ్యతిరేకంగా బంద్
  • ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
  • కూంబింగ్ ముమ్మరం చేసిన భద్రతాబలగాలు

తమను అణచివేసేందుకు భద్రతాబలగాలు చేపట్టిన ఆపరేషన్ సమాధాన్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈరోజు భారత్ బంద్ ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు హింసకు పాల్పడవచ్చన్న అనుమానంతో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అప్రమత్తమయింది. విశాఖపట్నం జిల్లా నుంచి ఒడిశాకు వెళ్లే తమ బస్సు సర్వీసులను నిన్న రాత్రి నుంచి నిలిపివేసింది.

దీంతో వాహనాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతాబలగాలు భారీ సంఖ్యలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

maoist
bharat bandh
january 31
apsrtc
bus services stopped
  • Loading...

More Telugu News