Mumbai: సూసైడ్ చేసుకున్న హిందీ టీవీ నటుడు రాహుల్ దీక్షిత్

  • ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఘటన
  • ఆసుపత్రికి తరలించేలోపే మృతి
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ముంబైలోని అంధేరీ ప్రాంతంలో వర్థమాన టీవీ నటుడు రాహుల్ దీక్షిత్ (28) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు,  లోఖండ్ వాలాలోని తన ఇంట్లోనే రాహుల్ ఉరేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కుటుంబీకులు వచ్చి చూసి, రాహుల్ ను కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు స్పష్టం చేశారు. ఘటనా స్థలిలో తమకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, రాహుల్ దీక్షిత్ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా రాహుల్ తండ్రి మహేష్ దీక్షిత్ తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో 'ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్లిపోయావు రాహుల్' అని కామెంట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

Mumbai
Andheri
Rahul Dikshit
Sucide
  • Loading...

More Telugu News