ramdev baba: కుంభమేళాలో పాల్గొంటున్న సాధువులకు బాబా రాందేవ్ సూచన

  • ధూమపానానికి దూరంగా ఉండండి
  • రాముడు, కృష్ణుడు ఎప్పుడూ ధూమపానం చేయలేదు
  • గొప్ప ఆశయం కోసం అన్నీ వదిలేసిన మనం.. ధూమపానాన్ని ఎందుకు మానేయలేం

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కుంభమేళాలో పాల్గొన్నారు. గంగానదిలో పవిత్ర స్నానమాచరించి... గంగమ్మకు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కుంభమేళాకు భారీ ఎత్తున తరలి వచ్చిన సాధువులను ఆయన కలిశారు. ధూమపానం చేయవద్దని ఈ సందర్భంగా సాధువులకు బాబా రాందేవ్ సూచించారు.

రాముడు, కృష్ణుడు ఎప్పుడూ ధూమపానం చేయలేదని... వారిని పూజించే మనం ధూమపానం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఇక నుంచి ధూమపానం చేయబోమని మనమంతా ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. మనం సాధువులమని, తల్లిదండ్రులను వదిలేసి గొప్ప ఆశయ సాధన కోసం వచ్చామని.. అలాంటి మనం ధూమపానాన్ని ఎందుకు మానేయలేమని అన్నారు. యువత కూడా ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.

ramdev baba
smoking
sadhu
kumbh mela
  • Loading...

More Telugu News