lagadapati: ఎవరినైనా కలుస్తా.. గతంలో జగన్ ను కూడా కలిశా: లగడపాటి

  • నేను ఏ పార్టీలో లేను.. ఎవరినైనా కలుస్తా
  • ఏపీలో టీఆర్ఎస్, వైసీపీలు కలసి పోటీ చేస్తే తప్పేమీ లేదు
  • టీఆర్ఎస్ కూడా తెలుగు రాష్ట్రానికి చెందిన పార్టీనే

ఒక సిద్ధాంతానికి కట్టుబడి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని లగడపాటి చెప్పారు. అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పానని... ఏపీలో పోటీ చేస్తానని చెప్పలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంపై స్పందిస్తూ, తాను ఏ రాజకీయ పార్టీలో లేనని... ఎవరినైనా కలుస్తానని చెప్పారు. గతంలో జగన్ ను కూడా కలిశానని, పవన్ తో ఫోన్ లో మాట్లాడానని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్, వైసీపీలు బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నాయని... ఏపీలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తప్పేమీ లేదని చెప్పారు. టీఆర్ఎస్ కూడా తెలుగు రాష్ట్రానికి చెందిన పార్టీనే అని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

lagadapati
jagan
chandrababu
Pawan Kalyan
congress
Telugudesam
TRS
janasena
ysrcp
  • Loading...

More Telugu News