Vijaya Bhaskar Reddy: టీడీపీలోకి వెళితే నా తండ్రి ఆత్మ ఎందుకు క్షోభిస్తుంది?.. ఏం చేసినా ధైర్యంగా చేస్తాం: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

  • నా తండ్రి ప్రజల కోసమే ఆలోచించేవారు
  • కాంగ్రెస్ పార్టీ నిర్ణయం నాకు నచ్చలేదు
  • కార్యకర్తలను కాదని నిర్ణయం తీసుకోను

టీడీపీలోకి వెళితే తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆత్మ ఎందుకు క్షోభిస్తుందని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని, తమ కుటుంబం ఏం చేసినా ధైర్యంగా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల పొత్తులపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు నచ్చలేదన్నారు. నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కార్యకర్తలను కాదని తాను ఎలాంటి నిర్ణయం తీసుకోనన్నారు. సీఎం చంద్రబాబు తనకు మంచి మిత్రుడని, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేయాలని తాను సీఎంను కోరానని తెలిపారు.

Vijaya Bhaskar Reddy
Surya Prakash Reddy
Telugudesam
Chandrababu
Congress
  • Loading...

More Telugu News