modi: ఏపీలో మోదీ, అమిత్ షాల పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదిగో!

  • గుంటూరు, విశాఖపట్టణంలలో పర్యటించనున్న మోదీ
  • ఫిబ్రవరి 4న విజయనగరంలో బస్సు యాత్రను ప్రారంభించనున్న అమిత్ షా
  • చంద్రబాబు అవినీతిని తట్టుకోలేక ఏపీ నుంచి కియా వెళ్లిపోయేదన్న కన్నా

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల పర్యటనలు ఖరారయ్యాయి. పర్యటనల వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖలో మోదీ పర్యటించనున్నారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 4న విజయనగరంలో బస్సు యాత్రను అమిత్ షా ప్రారంభిస్తారని చెప్పారు. 21న రాజమండ్రిలో క్లస్టర్ మీటింగ్, 25న పార్లమెంట్ నియోజకవర్గ శక్తి కేంద్రాలతో సమావేశం, 26న ఒంగోలులో జరిగే కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై కన్నా వివర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిని తట్టుకోలేక కియా మోటార్స్ ఏపీ నుంచి వెళ్లిపోయేదని... మోదీ సూచనతోనే ఏపీకి కియా వచ్చిందని చెప్పారు. కేంద్ర పథకాలను చంద్రబాబు తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్ఐఏ, ఈడీలతో పాటు తనకు కూడా చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు.

modi
amit shah
Chandrababu
kanna
bjp
Telugudesam
tour
ap
  • Loading...

More Telugu News