hansika: నా ప్రైవేట్ ఫొటోలను కావాలని లీక్ చేయించాల్సిన అవసరం నాకు లేదు: హన్సిక

  • నా గురించి నేను ఇంత వరకు ఎక్కువగా చెప్పుకున్నది లేదు
  • సోషల్ మీడియాను నేను ఎలా ఫాలో అవుతానో దీన్ని బట్టి అర్థమవుతుంది
  • ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు

సినీనటి హన్సికకు చెందిన ప్రైవేట్ ఫొటోలు ఇటీవల లీకై, సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అభిమానులు వెంటనే స్పందించి... హన్సికకు, ఇన్స్టాగ్రామ్ కు ట్యాగ్ చేయడంతో, ఇన్స్టా వాటిని వెంటనే తొలగించింది. మరోవైపు, కావాలనే హన్సిక ఈ ఫొటోలను లీక్ చేయించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై హన్సిక స్పందిస్తూ, తన గురించి ఇప్పటి వరకు బయటకు ఎక్కువగా చెప్పుకున్నది కూడా లేదని... సోషల్ మీడియాను తాను ఎలా అనుసరిస్తానో దీన్ని బట్టే అర్థమతుందని తెలిపింది. కావాలనే ఫొటోలను లీక్ చేయించానని అంటున్నవారికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎవరేమనుకున్నా తనకు ఇబ్బంది లేదని తెలిపింది.

hansika
tollywood
photo
leak
  • Loading...

More Telugu News