Karnataka: రైతులను పెళ్లాడండి.. రూ.లక్ష బహుమతి పట్టుకెళ్లండి!: యువతులకు బంపర్ ఆఫర్

  • ప్రకటించిన ఆనగోడ సేవా సహకార సంఘం
  • కర్ణాటకలోని యల్లాపురలో ఘటన
  • ఈ ఏడాది మార్చి నుంచి అమల్లోకి

ఒకప్పుడు అబ్బాయిలు ఓకే చెప్పడమే లేటు.. రెండు కుటుంబాలు పెళ్లికి చకచకా ఏర్పాట్లు పూర్తిచేసేవి. కానీ రోజులు మారిపోయాయి. ఇప్పటి అమ్మాయిలకు అబ్బాయి నచ్చాలంటే మంచి ఉద్యోగం, అందం, ఆస్తి.. ఇలా లిస్ట్ ఇంకా సాగుతూనే ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, యువ రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని యల్లాపుర ప్రాంతానికి చెందిన ఆనగోడ గ్రామ సేవా సహకార సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

తమ గ్రామానికి చెందిన యువ రైతులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.లక్ష బహుమతిగా ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ఆయా యువకులు తమ సహకార సంఘంలో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో కులాల ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది.

కేవలం ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలే కాకుండా పక్క గ్రామాలకు చెందిన యువతులు కూడా రైతులను పెళ్లాడవచ్చు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతామని పేర్కొంది. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Karnataka
farmers
co-operative society
offer
one lakh rupees
  • Loading...

More Telugu News