Andhra Pradesh: నేటి నుంచి ఏపీలో ‘ఒక రాష్ట్రం-ఒక నంబర్ సిరీస్’ అమలు!

  • ఇకపై అన్ని వాహనాలకు ఏపీ 39 సిరీస్
  • తొలి నంబర్ ను అందుకున్న ముప్పాళ్ల కల్పన
  • ఆర్టీసీ వాహనాలకు ఏపీ 39 జెడ్ సిరీస్ కేటాయింపు

ఆంధ్రప్రదేశ్  రవాణా శాఖలో కీలక సంస్కరణ అయిన ‘ఒక రాష్ట్రం-ఒక నంబర్ సిరీస్’ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీనిప్రకారం నేటి నుంచి అమ్ముడయ్యే అన్ని వాహనాలకు ఏపీ 39 సిరీస్ తో నంబర్ ప్లేట్లను జారీచేస్తారు. ఏపీ రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏపీ 39 సిరీస్ లో తొలి నంబర్ ‘ఏపీ 39 0002’ను ముప్పాళ్ల కల్పన అనే మహిళకు అందజేశారు. ఇక ఆర్టీసీ వాహనాలకు ఏపీ 39జెడ్, పోలీసు వాహనాలకు ఏపీ 39పీ, రవాణా వాహనాలకు ఏపీ 39 టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్ లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయం నేపథ్యంలో ఇప్పటివరకూ జిల్లాల వారీగా అమలు చేస్తున్న సిరీస్ విధానం ముగిసిపోనుంది.

Andhra Pradesh
new number series
Minister
achannaidu
  • Loading...

More Telugu News