dated lands: చుక్కల భూములపై బిల్లుపెట్టే యోచనలో ఏపీ సర్కారు?

  • గవర్నర్‌ ఆర్డినెన్స్‌ తిరస్కరించడంతో నిర్ణయం
  • మరోసారి పంపడం కంటే ఇదే బెటరన్న ఆలోచన
  • ఇందుకు అవసరమైన ఏర్పాట్లు

చుక్కల భూముల (డాటెడ్‌ ల్యాండ్స్‌)పై నేరుగా బిల్లు తేవాలని ఆంధ్రప్రదేశ్‌ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. అసైన్‌లాండ్స్‌, డాటెడ్‌ ల్యాండ్స్‌పై సర్కారు రూపొందించి పంపిన రెండు ఆర్డినెన్స్‌లలో చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ తిప్పిపంపిన విషయం తెలిసిందే.

దరఖాస్తు పరిశీలన గడువుపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాన్ని సరిచేయడమో, లేక పున:పరిశీలన చేసి మళ్లీ గవర్నర్‌కు పంపడమో కంటే ఏకంగా బిల్లు రూపొందించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడం ఉత్తమం అన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు వస్తున్నందున అత్యవసరమైతే తప్ప ఇవే ఆఖరి సమావేశాలని స్పీకర్ గతంలో ప్రకటించి ఉండడంతో సర్కారు ఈ విషయంలో వడివడిగా అడుగులు వేస్తోంది. 

dated lands
apsrkara
bill
  • Loading...

More Telugu News