mayavati: మాయావతి, అఖిలేష్ లపై అసభ్యకరమైన పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

  • మాయావతిని అఖిలేష్ ఎత్తుకున్నట్టుగా ఫొటో మార్ఫింగ్
  • భర్త కోసం మాయావతి డిమాండ్ చేస్తోందంటూ కామెంట్
  • ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు

బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లపై అసభ్యకరమైన పోస్టును షేర్ చేసిన విశేష్ రాఠీ అనే వ్యక్తిపై మధుర పోలీసులు కేసు నమోదు చేశారు. మాయావతిని అఖిలేష్ భుజాలపై ఎత్తుకున్నట్టు మార్ఫింగ్ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. అంతేకాదు... మాయావతి తనకు భర్త కావాలని డిమాండ్ చేస్తోందని కామెంట్ పెట్టారు.

 దీంతో, లోహియా వాహిని సంస్థ నేత మున్నామాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకులపై అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టడం ద్వారా వారి పరువుకు భంగం కలిగించారని, పార్టీ కార్యకర్తల మనోభావాలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో విశేష్ రాఠీపై ఐటీ యాక్ట్ 66 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

mayavati
akhilesh yadav
sp
bsp
social media
post
arrest
  • Loading...

More Telugu News