Telangana: కల్వకుంట్ల కవిత చొరవ.. ఇరాక్ నుంచి సొంతగూటికి 14 మంది తెలంగాణ వాసులు!

  • ఇరాక్ లో ఐదు నెలలుగా నరకం
  • ఏజెంట్ల చేతిలో మోసపోయిన వైనం
  • కవిత, టీఆర్ఎస్ నేతలకు బాధితుల కృతజ్ఞతలు

ఇరాక్ లో గత 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న 14 మంది తెలంగాణవాసులకు విముక్తి కలిగింది. వీరి పరిస్థితిని తెలుసుకున్న టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విదేశాంగ శాఖ సాయంతో అక్కడి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.

ఈ నేపథ్యంలో ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది నిజామాబాద్ జిల్లా వాసులు విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి రైలులో బయలుదేరి ఈ రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగారు. ఈ సందర్భంగా తమను కాపాడినందుకు కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ నేతలు, అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెంట్లు మోసం చేయడంతో తాము ఇరాక్ లో చిక్కుకున్నామని పేర్కొన్నారు.

Telangana
TRS
K Kavitha
14 members
Nizamabad District
agent cheating
iraq
  • Loading...

More Telugu News