ap government: చుక్కల భూములపై ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను తిప్పిపంపిన గవర్నర్‌

  • దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం రెండు నెలల గడువుపై అభ్యంతరం
  • గతంలో నాలా ఆర్డినెన్స్‌ విషయంలో సర్కారు, గవర్నర్‌ మధ్య వివాదం 
  • మళ్లీ ఇప్పుడు ఇలా...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన రెండు ఆర్డినెన్స్‌లలో ఒకదాన్ని గవర్నర్‌ నరసింహన్‌ తిప్పిపంపారు. చుక్కల భూముల (డాటెడ్ ల్యాండ్‌)పై ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌లో దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం రెండు నెలలుగా నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పున:పరిశీలనకు పంపారు.

గతంలో నాలా ఆర్డినెన్స్‌ విషయంలోనూ ఇలాగే జరగడంతో అప్పట్లో గవర్నర్‌, ఏపీ సర్కార్‌ మధ్య వివాదం నెలకొంది. ఈసారి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. కాకపోతే ఈసారి సర్కారు రెండు ఆర్డినెన్స్‌లు జారీ చేయగా, వాటిలో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని లబ్ధిదారులు 20 ఏళ్ల వరకు అమ్ముకోకుండా ఉండేందుకు వీలుగా జారీచేసిన ఆర్డినెన్స్‌పై మాత్రం గవర్నర్‌ సంతకం చేశారు.

ap government
governor
ordinence
  • Loading...

More Telugu News