Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా రామ్ ట్వీట్.. ప్రశంసిస్తున్న నెటిజన్లు!

  • అనంతలో కియా తొలి కారు ఆవిష్కరణ
  • ఇంకా పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్య
  • ఏపీకి ఇది ముందడుగు అన్న హీరో రామ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అనంతపురం యూనిట్ లో తయారైన కియా తొలి కారును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం స్పందిస్తూ.. అనంతపురం లాంటి మారుమూల జిల్లాకు పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదన్నారు. కానీ ఈరోజు నిరంతర కృషితో జిల్లాకు సాగునీటిని అందించామన్నారు. ఇంకా మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయని అన్నారు.

దీంతో ట్విట్టర్ లో స్పందించిన హీరో రామ్ ఏపీ సీఎంపై ప్రశంసలు కురిపించారు. ‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి ఇది భారీ ముందడుగు. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’  అని ట్వీట్ చేశారు. దీంతో ఏపీ అభివృద్ధికి మద్దతు తెలుపుతున్న టాలీవుడ్ హీరో రామ్ పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

ఈ నేపథ్యంలో మరోసారి రామ్ స్పందిస్తూ.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సలు లేదు. ముందు నేను పౌరుడిని.. ఆ తర్వాతే నటుడిని’ అంటూ ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Tollywood
Anantapur District
kia cars
Twitter
ram
  • Loading...

More Telugu News