Kerala: అత్తింటిలోనే కాదు... పుట్టింటిలోనూ స్థానం కోల్పోయిన కనకదుర్గ!

  • ఈ నెల ఆరంభంలో అయ్యప్పను దర్శించుకున్న కనకదుర్గ, బిందు
  • కనకదుర్గను ఇంట్లోకి రానివ్వని అత్త, భర్త
  • గెంటేసిన సోదరుడు

శబరిమలలోని అయ్యప్ప దేవాలయానికి తన మిత్రురాలు బిందుతో కలిసివెళ్లి, పోలీసుల సాయంతో స్వామిని దర్శించుకున్న కనకదుర్గ పరిస్థితి, ఇప్పుడు మరింత డోలాయమానంలో పడింది. ఇప్పటికే ఆమెను భర్త, అత్తింటివారు ఇంట్లోకి రానిచ్చేందుకు నిరాకరించగా, ఆమె, ఇప్పుడు ఓ ప్రభుత్వ హోమ్ లో ఉంటోంది. తాజాగా, కనకదుర్గకు పుట్టింటిలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.

అత్తింటివారు ఆదరించని వేళ, కనీసం పుట్టింటికైనా వెళ్లాలని ఆమె ప్రయత్నించగా, సోదరుడు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదట. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించిన కనకదుర్గ, తమవారంతా తనపై చాలా కోపంగా ఉన్నారని వాపోయింది. అత్త తన తలపై బలంగా కొట్టడంతో, దాదాపు వారం రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొంది, ఆపై పుట్టింటికి వెళ్లగా, ఆమె సోదరుడు బయటకు తరిమేశాడు. కాగా, తాను చేసిన పనికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఎటువంటి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోబోనని, ఇంట్లోకి వెళ్లేందుకు చట్టబద్ధంగా పోరాడనున్నానని వెల్లడించింది.

Kerala
Sabarimala
Kanakadurga
Bingu
Ayyappa
  • Loading...

More Telugu News