Yatra: చంద్రబాబు, జగన్ పాత్రలు 'యాత్ర' సినిమాలో వుండవు!: మహి వీ రాఘవ

  • వైఎస్ పాదయాత్రకు దృశ్యరూపంగా 'యాత్ర'
  • ఎవరినీ తక్కువగా చూపాలని లేదు
  • అభిమానులను అయోమయంలో పడేయబోనన్న మహి 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు దృశ్యరూపంగా మహి వీ రాఘవ తెరకెక్కించిన ‘యాత్ర’ చిత్రం, వచ్చే నెల 8న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో వైఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు, ఆయన తనయుడు వైఎస్ జగన్ పాత్రలను ఎవరు పోషించారన్న సందేహాలు అభిమానుల్లో ఉన్న వేళ, దర్శకుడు మహి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో చంద్రబాబు, జగన్ పాత్రలు ఉండవని స్పష్టం చేశారు. తాను కేవలం వైఎస్ గురించి చెప్పేందుకే సినిమాను తీశానని, ఇతరులను తక్కువ చేయాలని భావించలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆయన, జగన్ పాత్ర కూడా చిత్రంలో ఉండబోదని, రెండు, మూడు నిమిషాల కోసం ఓ పాత్రను ప్రవేశపెట్టి, అభిమానులను అయోమయంలో పడేయడం తనకు ఇష్టం లేదని అన్నారు.

కాగా, ఈ చిత్రంలో వైఎస్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు, చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Yatra
Mahi V Raghava
Jagan
Chandrababu
  • Loading...

More Telugu News