Chandrababu: వైసీపీది పెద్ద డ్రామా పార్టీ.. అభిమాని పొడిస్తే నిందను టీడీపీపై వేశారు: లోకేష్

  • మోదీ భయపడాలే తప్ప.. సీఎం భయపడరు
  • 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నాం
  • టీడీపీని విమర్శించడానికే పోటీ సభలు
  • ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు

  కేసీఆర్‌తో కలిసి జగన్ సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని పెద్ద డ్రామా పార్టీగా అభివర్ణించారు. వైసీపీ అభిమాని జగన్‌ను పొడిస్తే ఆ నింద టీడీపీపై వేశారని విమర్శించారు. ఏపీ పోలీసులు చెప్పిన విషయాన్నే.. ఎన్‌ఐఏ కూడా ఒప్పుకుందని వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ నేతల పనిగా లోకేష్ పేర్కొన్నారు.

టీడీపీని విమర్శించడానికే వైసీపీ పోటీ సభలు పెడుతోందని చెప్పుకొచ్చారు. మోదీ భయపడాలే తప్ప... సీఎం ఎప్పుడూ భయపడరన్నారు. రేపటి అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలు రావాలని కోరారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని ప్రకటించారు. 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. లోటు బడ్జెట్ ఉన్నా 56 లక్షల కుటుంబాలకు పెన్షన్ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు ఏపీలో పరిశ్రమలు పెడుతున్నారని తెలిపారు.

Chandrababu
Nara Lokesh
YSRCP
Drama Party
NIA
Narendra Modi
  • Loading...

More Telugu News