Chandrababu: అవసరమైతే చంద్రబాబు నిరాహార దీక్షకు కూడా వెనుకాడరు: టీడీపీ ఎమ్మెల్సీ జనార్దన్

  • స్పందించకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటాం
  • 9వ తేదీ వరకూ ఎదురు చూస్తాం
  • వైసీపీ నేతలకు విమర్శించడమే పని

కేంద్ర వైఖరికి నిరసనగా చంద్రబాబు ఢిల్లీలో దీక్షకు దిగుతున్నారని.. అవసరమైతే ఆయన నిరాహార దీక్షకు కూడా వెనుకాడరని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు జరిగే అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు, సంఘాలను తమ ప్రభుత్వం తరపున ఆహ్వానించామన్నారు. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 13వ తేదీ వరకూ లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని.. 9వ తేదీ వరకూ ఎదురు చూస్తామని తెలిపారు. వైసీపీ నేతలకు తమను విమర్శించడమే పని అని జనార్దన్ ఆరోపించారు. తాము ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నామన్నది అవాస్తవమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న, ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టే రాష్ట్ర బంద్‌కు టీడీపీ మద్దతు ఉంటుందని జనార్దన్ స్పష్టం చేశారు.

Chandrababu
Delhi
Janardhan
Specia Status
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News