janasena: తమ సమస్యలను పరిష్కరించాలంటూ నాదెండ్ల మనోహర్ ను కలిసిన హిజ్రాలు

  • తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలంటూ విన్నపం
  • అవమానాలు, చీత్కారాలను అనుభవిస్తూ బతుకుతున్నాం
  • బాధలను చెప్పుకోవడానికే వచ్చాం

జనసేన నేత నాదెండ్ల మనోహర్ ను ఈరోజు హిజ్రాలు కలిశారు. వికలాంగుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు బండెల కిరణ్ రాజుతో కలిసి ట్రాన్స్ జెండర్ల రాష్ట్ర అధ్యక్షురాలు శ్రావణి, ప్రధాన కార్యదర్శి శ్వేత తదితరులు విజయవాడలోని జనసేన కార్యాలయంలో మనోహర్ ను కలిశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఈ సందర్భంగా మనోహర్ కు విన్నవించారు. అవమానాలు, చీత్కారాలను అనుభవిస్తూ బతుకుతున్నామని... తమ బాధలను జనసేనతో చెప్పుకోవడానికి వచ్చామని తెలిపారు.

హిజ్రాల డిమాండ్లు ఇవే:
  • ప్రతి హిజ్రాకు వయస్సుతో సంబంధం లేకుండా పెన్షన్ ఇవ్వాలి. 
  • పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. 
  • ఆరోగ్య భద్రత కల్పించాలి. 
  • చట్ట, న్యాయపరంగా ప్రత్యేక రక్షణ కల్పించాలి. 
  • రేషన్ కార్డులను మంజూరు చేయాలి. 
  • ఉపాధి కోసం బ్యాంక్ లింక్ లేకుండా రుణాలు ఇవ్వాలి. 
  • ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో దామాషా ప్రకారం ఉద్యోగ అవకాశం కల్పించాలి. 
  • స్థానిక సంస్థల నుంచి చట్ట సభల వరకు రాజకీయ రిజర్వేషన్ల ద్వారా అవకాశం కల్పించాలి. 

janasena
nadendla manohar
transgenders
  • Loading...

More Telugu News