Puri Jagannadh: పూరీ సినిమాలో హిందీ నటుడు

  • రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' 
  • కథానాయికగా నిధి అగర్వాల్
  • ప్రధాన విలన్ గా సుధాన్షు  

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే తాజాగా పూరీ జగన్నాథ్  సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడు. ఇటీవల రజనీకాంత్ చిత్రం '2.ఓ'లో సుధాన్షు ముఖ్య పాత్ర పోషించాడు. తాజాగా రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. ఇందులో సుధాన్షు ప్రధాన విలన్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. రామ్, పూరీలకు ఇద్దరికీ ఒక సక్సెస్ అవసరం కాబట్టి ఇద్దరూ ఈ ప్రాజక్టును కసిగా చేస్తున్నారట. రామ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా ఎంపికైంది. 

Puri Jagannadh
Ram
Rajani
Sudhanshu
  • Loading...

More Telugu News