george: భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టిన నితీష్ కుమార్

  • ఫెర్నాండెజ్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టిన నితీష్
  • ఆయన మార్గదర్శకత్వంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నా
  • ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాను

కేంద్ర మాజీ మంత్రి, దివంగత జార్జ్ ఫెర్నాండెజ్ తో తనకున్న అనుబంధం, మధుర స్మృతులను తలచుకుని బీహార్ సీఎం నితీష్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. ఫెర్నాండెజ్ గురించి మీడియాతో మాట్లాడుతూ, ఆయన నాయకత్వం, మార్గదర్శకత్వంలో తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. ఆయన నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని తెలిపారు. ప్రజల కోసం పాటుపడే తత్వాన్ని తాను ఆయన నుంచే నేర్చుకున్నానని చెప్పారు. ఆయన నాయకత్వం, ప్రజాపోరాటాలను తాము ఎన్నడూ మర్చిపోబోమని, వాటికి తాము దూరం కాబోమని చెప్పారు. మరోవైపు, ఫెర్నాండెజ్ మృతి కారణంగా బీహార్ లో రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.

george
fernandez
nitish kumar
bihar
  • Loading...

More Telugu News