ayodhya: కేంద్రానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే.. దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తాం: హాజి మెహబూబ్ అహ్మద్
- రామ మందిరం కేసులో వివాదంలో లేని భూమిని యజమానులకు అప్పగించాలంటూ కేంద్రం పిటిషన్
- ఆ భూమికి హిందువులు హక్కుదారులు కాదన్న మెహబూబ్ అహ్మద్
- పిటిషన్ వెనుక భారీ కుట్ర దాగుందంటూ వ్యాఖ్య
అయోధ్య రామ మందిరం-బాబ్రీ మసీదు కేసులో వివాదంలో లేని 67 ఎకరాల భూమిని... దాని యజమానులైన రామ జన్మభూమి న్యాస్ కు లేదా రామ మందిరం ట్రస్ట్ కు అప్పగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి హాజి మెహబూబ్ అహ్మద్ మండిపడ్డారు. ఆ భూమికి నిజమైన హక్కుదారులు హిందువులు కాదని ఆయన అన్నారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పిటిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తే... దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు.