bollywood: నన్ను ఎవరూ తిట్టనందుకు సంతోషిస్తున్నా: నటుడు మనోజ్ బాజ్ పాయ్

  • గతంలో అవార్డులు వస్తే సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారు
  • ఏ అర్హతతో అవార్డు ఇచ్చారంటూ విమర్శించేవారు
  • ఈసారి నాకు అలాంటి అనుభవం ఎదురు కాలేదు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తనకు పద్మశ్రీ వచ్చినందుకు ఎవరూ తిట్టలేదని... అందుకు సంతోషిస్తున్నానని చెప్పాడు.

గతంలో ప్రభుత్వ అవార్డులు వచ్చినప్పుడు ఏ అర్హతతో అవార్డు ఇచ్చారని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారని అన్నాడు. సదరు ఆర్టిస్టులు నటించిన పలు సినిమాను ప్రస్తావిస్తూ ఇష్టమొచ్చినట్టు విమర్శించేవారని తెలిపాడు. కానీ, ఈ సారి తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పాడు. రాత్రి నిద్రపోయే ముందు అనుపమ్ ఖేర్ తనకు ఫోన్ చేసి పద్మశ్రీ వచ్చినట్టు తెలిపారని... కాసేపు షాక్ లో ఉండిపోయానని తెలిపాడు. ఇంత గౌరవం తనకు దక్కుతుందని ఊహించలేదని చెప్పాడు.

bollywood
padmasri
manoj bajpayee
  • Loading...

More Telugu News