Ramgopal Varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుంచి మరిన్ని ఫొటోలు... ఎవరో చెప్పాలంటున్న రామ్ గోపాల్ వర్మ!

- మరో రెండు ఫొటోలు విడుదల చేసిన వర్మ
- 'వీరంతా లక్ష్మీ పార్వతి కారణంగా అప్ సెట్ అయ్యారు' అని వ్యాఖ్య
- ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేసిన వర్మ
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కోణం నుంచి ఆయన జీవిత చరిత్రలోని ఓ భాగాన్ని'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ రోజుకో చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన, నేడు మరో రెండు ఫొటోలను విడుదల చేశారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఈ క్యారెక్టర్ ఎవరిది? అంటూ ఓ ఫొటోను, నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది... ఇక్కడి వారంతా లక్ష్మీ పార్వతి కారణంగా అప్ సెట్ అయినట్టు కనిపిస్తున్నారంటూ మరో ఫొటోను పోస్ట్ చేశారు.

Can somebody tell me who this character is in #LakshmisNTR ? pic.twitter.com/RRwKt8gXsY
— Ram Gopal Varma (@RGVzoomin) January 29, 2019
I wonder who these characters are in #LakshmisNTR and why they are looking so upset with Lakshmi Parvathi ? pic.twitter.com/KAdAKrHIVR
— Ram Gopal Varma (@RGVzoomin) January 29, 2019