Sonakshi Sinha: రాజమౌళి సినిమాలో సోనాక్షి .. అలియా భట్?

- షూటింగు దశలో రాజమౌళి మూవీ
- తెరపైకి బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు
- 2020లో ప్రేక్షకుల ముందుకు
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఒక మల్టీస్టారర్ రూపొందుతోంది. ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. మూడవ షెడ్యూల్ నుంచి కథానాయికల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించవలసి వుంది. అందువలన కథానాయికల ఎంపిక ప్రక్రియపై దృష్టిపెట్టారు.
