Paritala sunitha: మంత్రి పరిటాల సునీతకు రవి ముఖ్య అనుచరుడు రాజన్న షాక్.. త్వరలో వైసీపీలో చేరిక

  • సునీత కుటుంబ పాలన చేస్తున్నారు
  • భర్త ఆశయాలను ఆమె పక్కన పెట్టారు
  • ఆమెతో ఇక వేగలేం.. పార్టీని వీడుదాం

రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ పరిటాల రవి ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న ఆరోపించారు. సునీత వైఖరి వల్లే తాను నాలుగేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. స్వగ్రామం తల్లిమడుగులలో టీడీపీ నేతలు, అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే నాడు పరిటాల రవితో కలిసి భూస్వామ్య పోరాటాలు చేసినట్టు రాజన్న తెలిపారు. భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సునీత ఆయన ఆశయాలను పక్కనపెట్టారని ఆరోపించారు.  రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ సభ్యులు, బంధువులకు తప్ప పేదలకు, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న మేలేమీ లేదన్నారు. ఇక సునీతతో వేగలేమని, పార్టీని వీడుదామంటూ రాజన్న పిలుపునిచ్చారు. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.

Paritala sunitha
Raptadu
Anantapur District
Telugudesam
vepakunta Rajanna
YSRCP
  • Loading...

More Telugu News