George Fernandes: స్వైన్ ఫ్లూకు చికిత్స పొందుతూ మాజీ రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కన్నుమూత!

  • కొన్ని రోజులుగా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఫెర్నాండెజ్
  • వాజ్ పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా సేవలు
  • సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నాయకులు

కేంద్ర మాజీ మంత్రి జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన రక్షణ మంత్రిగా పనిచేశారు. గత కొన్నేళ్లుగా అల్జీమర్స్ తో బాధపడుతున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

1930 జూన్ 3న మంగళూరులో జన్మించిన ఆయన,  1967లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. జనతాదళ్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఆపై సమతా పార్టీని స్థాపించిన ఆయన, రక్షణ శాఖతో పాటు సమాచార, పరిశ్రమల, రైల్వే శాఖలను కూడా నిర్వహించారు. ఫెర్నాండెజ్ మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం వెలిబుచ్చారు.

George Fernandes
Passes Away
Swineflu
  • Loading...

More Telugu News