Vizag: విశాఖపట్నం శారదా పీఠం నుంచి కేసీఆర్ కు ఆహ్వానం!

  • ఫిబ్రవరి 14న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
  • హాజరు కావాలని తెలంగాణ సీఎంకు ఆహ్వానం
  • అదే రోజు జగన్ గృహ ప్రవేశం కూడా!

విశాఖపట్నంలోని శారదాపీఠం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 14వ తేదీన శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనుండగా, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పీఠం నిర్వాహకులు కేసీఆర్ ను ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

కాగా, 14వ తేదీన మంచి ముహూర్తం ఉండటంతో వైకాపా అధినేత వైఎస్ జగన్ సైతం తన నూతన గృహప్రవేశం చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రావాలని కూడా కేసీఆర్ కు ఆహ్వానం అందింది. దీంతో కేసీఆర్ మరోసారి ఏపీలో పర్యటించి రెండు కార్యక్రమాలకూ హాజరవుతారా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Vizag
Sarada Peetham
KCR
Jagan
  • Loading...

More Telugu News