sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలిసిన చిరంజీవి

  • సిరివెన్నెలకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం
  • సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న అభినందనలు
  • సిరివెన్నెల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

టాలీవుడ్ సినీ ప్రముఖుడు సిరివెన్నెల సీతారామశాస్త్రికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో, ఆయనకు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, సిరివెన్నెల ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ కలసి చాలా సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. మరోవైపు, మా అధ్యక్షుడు శివాజీరాజా, త్రివిక్రమ్ శ్రీనివాస్, బుర్రా సాయిమాధవ్, ఆర్పీ పట్నాయక్ తదితరులు కూడా సిరివెన్నెలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

sirivennela
padmasri
chiranjeevi
tollywood
  • Loading...

More Telugu News