tirumala: తిరుమల క్యూలైన్లో తెలంగాణ ఉన్నతాధికారికి గుండెపోటు.. మృతి

  • స్వామివారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు
  • గుండెపోటుతో క్యూలైన్లో కుప్పకూలిన అధికారి
  • స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తిరుమల వెళ్లారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వెళ్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో, ఆయనను హుటాహుటిన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. 

tirumala
telangana
officer
heart attack
  • Loading...

More Telugu News