london: లండన్ లో భారత జాతీయ పతాకం దహనంపై బ్రిటన్ ప్రభుత్వ స్పందన!

  • గణతంత్ర దినోత్సవం నాడు దారుణ ఘటన
  • జాతీయ పతాకాన్ని దహనం చేసిన బ్రిటీష్ సిక్కు, కశ్మీరీ వేర్పాటు సంస్థలకు చెందిన దుండగులు
  • ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించిన బ్రిటన్

లండన్ లో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. కొందరు వేర్పాటు వాదులు మన జాతీయ పతాకాన్ని లండన్ లోని భారతీయ హైకమిషన్ కార్యాలయం వద్ద దహనం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. భారత పతాకాన్ని దహనం చేసిన ఘటనతో ఆవేదన చెందుతున్నామని చెప్పింది. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించింది.

యావత్ భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్న వేళ... బ్రిటీష్ సిక్కు, కశ్మీరీ వేర్పాటు సంస్థలకు చెందిన వారు లండన్ లోని ఇండియా హౌస్ వద్ద నిరసన ప్రదర్శనను నిర్వహించారు. భారత్ కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో జాతీయ జెండాను దహనం చేశారు. 

london
india
national flag
fire
britain
  • Loading...

More Telugu News