rahul gandhi: ఎన్నికల ముందు కీలక హామీని ఇచ్చిన రాహుల్ గాంధీ

  • ప్రతి పేదవాడికి కనీస ఆదాయం ఉండేలా చేస్తాం
  • సోదర, సోదరీమణులు బాధపడుతుంటే.. నవ భారతాన్ని నిర్మించలేం
  • కనీస ఆదాయ హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేదలకు కీలక హామీని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రతి పేదవాడికి కనీస ఆదాయం ఉండేలా చేస్తామని చెప్పారు. ఆకలి, పేదరికాన్ని నిర్మూలించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

లక్షలాది మంది సోదర, సోదరీమణులు పేదరికంతో, ఆకలితో బాధపడుతూ ఉంటే... మనం నవ భారతాన్ని నిర్మించలేమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో, ప్రతి పేదవాడికి కనీస ఆదాయ హామీని ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. చత్తీస్ గఢ్ లో ఓ బహిరంగసభలో మాట్లాడుతూ, ఆయన ఈ హామీని ఇచ్చారు.

rahul gandhi
congress
minimum income
shceme
  • Loading...

More Telugu News