kotla: టీడీపీలో కోట్ల చేరిక ప్రభావం రాష్ట్రమంతా ఉంటుంది: ఎస్వీ మోహన్ రెడ్డి

  • టీడీపీలో కోట్ల చేరడాన్ని స్వాగతిస్తున్నాం
  • ఆయన తండ్రి సీఎంగా పని చేశారు
  • పురందేశ్వరి, దగ్గుబాటి రాజకీయాలను ప్రజలు నమ్మరు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఆయన కర్నూలు నుంచి అమరావతికి బయల్దేరారు. ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీలో కోట్ల చేరడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

 సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రిగా పని చేశారని, ఆయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా పని చేశారని... ఈ నేపథ్యంలో టీడీపీలో కోట్ల చేరిక ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్పారు. ఆయన రాకతో టీడీపీ మరింత బలపడుతుందని తెలిపారు. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుల రాజకీయాలను ప్రజలు నమ్మరని చెప్పారు. ఒకే కుటుంబంలో బీజేపీ, వైసీపీలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.

kotla
suraprakash reddy
Telugudesam
congress
sv mohan reddy
purandeswari
daggubati
ysrcp
bjp
  • Loading...

More Telugu News