pawan kalyan: జనసేన దూకుడు.. ప్రచార రథాలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రచార రథాలను ప్రారంభించిన పవన్
  • రథాలపై పార్టీ సిద్ధాంతాలు, చేపట్టబోయే పథకాల ముద్రణ
  • రేపటి నుంచి ప్రచారంలోకి దిగనున్న రథాలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన దూకుడు పెంచుతోంది. భారీ ఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేయకుండా... తక్కువ ఖర్చుతోనే ప్రజల్లోకి తమ సిద్ధాంతాలను తీసుకెళ్లేలా కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రచార రథాలను సిద్ధం చేసింది. వాటిపైన పార్టీ సిద్ధాంతాలు, అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే పథకాలను ముద్రించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొత్తగా నిర్మించిన జనసేన కార్యాలయంలో ప్రచార రథాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకట్టుకునేలా రథాలను సిద్ధం చేసిన జనసైనికులను పవన్ అభినందించారు. రేపటి నుంచి ఈ ప్రచార రథాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నాయి.

pawan kalyan
campaigning vehicles
prachara ratham
janasena
  • Loading...

More Telugu News