purandheswari: పురంధేశ్వరి వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు: కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ

  • బీజేపీలో ఉంటూ భర్త, కుమారుడిని వైసీపీలో చేర్పించడం సిగ్గుచేటు
  • బీజేపీ, వైసీపీల తెరచాటు భాగోతం బట్టబయలైంది
  • కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర వ్యాఖ్యలు

బీజేపీ కీలక నేత పురంధేశ్వరిపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ... ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ లను వైసీపీలో చేర్పించడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ, వైసీపీల తెరచాటు భాగోతం... వైసీపీలో దగ్గుబాటి చేరికతో బహిర్గతమైందని చెప్పారు. పద్మశ్రీ వ్యాఖ్యలపై దగ్గుబాటి కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు వైసీపీలో దగ్గుబాటి చేరికను ఆ పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకిస్తున్నారు.

purandheswari
sunkara padmasri
bjp
congress
ysrcp
daggubati
hitesh
  • Loading...

More Telugu News