jawahar: జగన్ వి నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలు: జవహర్

  • జగన్ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు
  • బీసీ సదస్సుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది
  • పురందేశ్వరి టార్గెట్ కూడా చంద్రబాబే

వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలు... నకిలీ రత్నాలని ఏపీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయ్యేది లేదు... ఆయన ఇచ్చిన హామీలను అమలు చేసేదీ లేదని అన్నారు. దేశ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని... జగన్ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని చెప్పారు. రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు టీడీపీ వెనుకే ఉన్నారని తెలిపారు. రాజమండ్రిలో నిన్న నిర్వహించిన బీసీ సదస్సును చూసి జగన్ వెన్నులో వణుకు మొదలైందని చెప్పారు. చంద్రబాబుపై దుష్ప్రచారం చేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి టార్గెట్ కూడా చంద్రబాబేనని చెప్పారు.

jawahar
jagan
Chandrababu
purandheswari
Telugudesam
ysrcp
bjp
  • Loading...

More Telugu News