kangana: బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోన్న 'మణికర్ణిక'
- ఈ నెల 25న వచ్చిన 'మణికర్ణిక'
- 3 రోజుల్లో దేశవ్యాప్తంగా 46 కోట్ల వసూళ్లు
- ఓవర్సీస్ లో ఒక మిలియన్ డాలర్ల క్లబ్ లోకి
వీరనారి 'ఝాన్సీ లక్ష్మీబాయి' జీవితచరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' చిత్రం నిర్మితమైంది. క్రిష్ - కంగనా దర్శకత్వం వహించిన ఈ సినిమా, రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లక్ష్మీబాయి లుక్ తో కంగనా నూటికి నూరు మార్కులు కొట్టేయడంతోనే ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. టీజర్ .. ట్రైలర్ బయటికి వచ్చిన తరువాత అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇలా భారీ అంచనాల మధ్య థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, దేశవ్యాప్తంగా 3 రోజుల్లో 46 కోట్లను వసూలు చేసింది. అంటే 50 కోట్ల మార్క్ కి చేరువైపోయింది. ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్లపరంగా తన దూకుడు చూపుతోంది. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇదే జోరును కనబరిస్తే, చాలా తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.